schedule Monday, July 06, 2026

ఆదర్శనీయయుడు దొడ్డి కొమురయ్య

calendar_today October 9, 2023
person dharshininews
ఆదర్శనీయయుడు దొడ్డి కొమురయ్య
ఆదర్శనీయయుడు దొడ్డి కొమురయ్య - తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి - శాంతినగర్‌లో కొమురయ్య విగ్రహావిష్కరణ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అందరికి ఆదర్శనీయుడు అని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణం యశోధనగర్ లో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ భూమి కోసం, విముక్తి కోసం ఉద్యమించిన దొడ్డి కొమురయ్య తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిదాయుడుగా నిలుస్తారని అన్నారు. అందరికి ఆదర్శనీయుడు అయిన ఆయన ఆశయ సాధనకు అందరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ఫ్లోర్ లీడర్ శోభారాణి, బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల సర్సింలు, శ్రీనివాస్ చారి, కురుమ సంఘం నాయకులు పల్లె వెంకటయ్య, పూజారి పాండు, బీరప్ప తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/20933/