schedule Sunday, September 20, 2026

ఎలక్షన్ ఎఫెక్ట్..!

calendar_today October 10, 2023
person dharshininews
ఎలక్షన్ ఎఫెక్ట్..!
ఎలక్షన్ ఎఫెక్ట్..! - ప్రజావాణి తాత్కాళిక రద్దు - ప్రకటించిన జిల్లా కలెక్టర్ - మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారంటే..? వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంపై ప్రభావం చూపింది. వికారాబాద్‌ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణీ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం తాత్కాళికంగా తీసుకున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కారణంగా ప్రజావాణికి రద్దు చేస్తున్నట్లు వివరించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. తెలంగాణ ఎన్నికల తరువాత యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి.. https://dharshininews.com/20955/