schedule Monday, July 06, 2026

రండి.. లక్షాధికారులు కండి..!

calendar_today October 14, 2023
person dharshininews
రండి.. లక్షాధికారులు కండి..!
రండి.. లక్షాధికారులు కండి..! - ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్‌ - లక్కీ డ్రా ద్వారా నగదు బహుమతులు - ఎలా అందిస్తారంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : రండి.. లక్షాధికారులు కండి అంటూ ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. దసరా పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ బస్సులలో సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు రూ. 11 లక్షల నగదు బహుమతులను గెలుచుకునే అవకాశం కల్పించింది. ఈనెల 21వ తేదీ నుండి 23 వరకు తిరిగి 28వ తేదీ ఉండి 30 వరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులలో ప్రయాణించే వారందరూ ఈ లక్కీ డ్రాకు అర్హులు. ప్రయాణికులు వారి ప్రయాణ అనంతరం టికెట్టు వెనకాల పూర్తి పేరు మరియు ఫోన్ నెంబరు రాసి బస్టాండ్లలో ఏర్పాటుచేసిన డ్రాప్ బాక్స్ లలో వేయాలి. ఈ డ్రాప్ బాక్స్ లను పురుషులకు మరియు స్త్రీలకు విడివిడిగా ఏర్పాటు చేయడం అయినది. అయితే తాండూరు డిపో కి సంబంధించి లక్కీ డ్రా బాక్స్ లను తాండూరు మరియు కొడంగల్ బస్టాండ్లలో ఏర్పాటు చేయడమైనది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 110 మంది విజేతలను ఎంపిక చేయనున్నారు. ప్రయాణికులందరూ పెద్ద ఎత్తున ఈ లక్కీ డ్రా లో పాల్గొని విజయవంతం చేయాలని తాండూరు డీపో మేనేజర్ సమతారెడ్డి సూచించారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/21057/