schedule Monday, July 06, 2026

కమలం నిస్తేజం..!

calendar_today October 14, 2023
person dharshininews
కమలం నిస్తేజం..!
కమలం నిస్తేజం..! - పత్తాలేని ఎమ్మెల్యే దరఖాస్తు దారులు - అభ్యర్థి ఎవరో తేల్చకోలేక పోతున్న వైనం - పార్టీ పరిస్థితిపై అయోమయం తాండూరు, దర్శిని ప్రతినిధి: దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ శాసిస్తుంటే.. వికారాబాద్ జిల్లాలోని తాండూరులో మాత్రం నిస్తేజంలో పడిపోయింది. ఒకప్పుడూ ఊపుమీదున్న పార్టీలో గత కొన్ని రోజులుగా అంతర్మమధన పరిస్థితిలు ఏర్పడ్డాయి. ఓ రాజకీయ నాయకుడి విశ్లేషణ ప్రకారం.. కర్ణాటకలో ఎన్నికలకు ముందు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బీజేపీ ప్రభావంలో ఉంది. ఆ ఎన్నికల్లో ఓటమి తరువాత ప్రభావం తగ్గుముఖం పట్టింది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోడ్‌కు ముందు సరిగ్గా మూడు నెలల ముందు కూడా బీజేపీ దూకుడుగా ఉంది. కాని తాండూరు అసెంబ్లీ అభ్యర్థి కోసం పదుల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో పార్టీ ప్రభావం పడిపోయిందని చెప్పొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీలో బీజేపీ అభ్యర్థిగా పటేల్ రవిశంకర్, ఆయన సతీమణి పటేల్ జయశ్రీ, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్‌ కుమార్, కౌన్సిలర్ సాహు శ్రీలత, అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్ తదితరులు పదుల సంఖ్యలో దరఖాస్తులు సమర్పించారు. ఎంత ఉత్సహాంతో దరఖాస్తులు సమర్పించారో.. అవకాశాన్ని దక్కించుకోవడంలో మాత్రం నిస్తేజం ప్రదర్శిస్తున్నారని విమర్శలు వ్యక్తవుతున్నాయని అన్నారు. దరఖాస్తులు సమర్పిస్తే సరిపోయిందా.. ఆ తరువాత నుంచి పత్తాలేకుండా పోతే పార్టీని నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఏమవుతుందని ఆందోళన వ్యక్తమవుతుందన్నారు. వారిలో వారే అభ్యర్థులు ఎవరో తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడడం పార్టీకి దెబ్బ పడినట్లుగా అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు ఇదే పరిస్థితిపై కార్యకర్తలు సైతం అయోమయం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/21071/