schedule Friday, September 18, 2026

కుల వృత్తులకు ప్రాధాన్యం

calendar_today October 18, 2023
person dharshininews
కుల వృత్తులకు ప్రాధాన్యం
కుల వృత్తులకు ప్రాధాన్యం - తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి - ప్రజా దీవెనలో కుల వృత్తిదారులతో సమావేశం తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కుల వృత్తిదారుల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇస్తోందని తాండూరు ఎమ్మెల్యే పైలెట రోహిత్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణ శివారు భవాని ఫంక్షన్ హాల్లో నాయి బ్రాహ్మణ, రజక, మోచీహర్లయ్య కమిటి కుల వృత్తి దారులతో ప్రజా దీవెన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కుల వృత్తిదారులు పలు సమస్యలను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దృష్టికి తీసుకవచ్చారు. అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కుల వృత్తిదారుల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కమిటీ సభ్యులు దృష్టికి తీసుకవచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా కుల వృత్తిదారుల సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/21159/