schedule Friday, September 18, 2026

మనోహర్ రెడ్డితో కలిసిన ధారాసింగ్

calendar_today October 26, 2023
person dharshininews
మనోహర్ రెడ్డితో కలిసిన ధారాసింగ్
మనోహర్ రెడ్డితో కలిసిన ధారాసింగ్ - కలిసిపోయిన రెండు వర్గాలు - బీఆర్ఎస్ ఓటమే పనిచేస్తామని సంకేతం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని కాంగ్రెస్ పార్టీలో ఆసంతృప్తిలు తొలగిపోయాయి. డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డితో టీపీపీపీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, టీపీపీపీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహారాజ్ వర్గం నేతలు కలిసి పోయారు. గురువారం తాండూరు పట్టణం వెంకోబా గార్డెన్ లో జరిగిన పార్టీ సమావేశం ఇందుకు వేదికయ్యింది. ఈ సమావేశంలో మనోహర్ రెడ్డితో ధారాసింగ్‌తో పాటు పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి సీనియర్ నాయకులు ఉత్తమ్ చంద్, జనార్ధన్ రెడ్డి, ఎంఎ ఆలీం, సర్దార్ ఖాన్, మహిళ అధ్యక్షురాలు శోభారాణి తదితరులు కలిసి పోయారు. అనంతరం సమావేశంలో బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు పనిచేయాలని సంకేతాన్ని వినిపించారు. మనోహర్ రెడ్డితో ఎం. రమేష్ మహరాజ్ వర్గం, ధారాసింగ్, నేతలు కలిసి పోవడంతో కాంగ్రెస్ పార్టీలో నూతన జోష్ నిండింది. ఇది కూడా చదవండి... https://dharshininews.com/21318/