తాండూరుకు వస్తా.. ప్రచారం చేస్తా..!
October 30, 2023
dharshininews
తాండూరుకు వస్తా.. ప్రచారం చేస్తా..!
- మీరు మంచే మిమ్మల్ని గేలిపిస్తుంది
- బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.క్రిష్ణయ్య
- ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి మద్దతు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలోని తాండూరుకు వచ్చి మీ గెలుపుకు తోడ్పాటు అందిస్తామని బిసి సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు అర్.కృష్ణయ్య అన్నారు. సోమవారం హైదరాబాద్ లో బిసి సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.క్రిష్ణయ్యతో తాండూరు బిఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గంలో బిసి సామాజిక వర్గంకు చేసిన కార్యక్రమాలను వివరించారు. ప్రస్తుత ఎన్నికలలో మద్దతు అందించాలని ఆర్.క్రిష్ణయ్యను రోహిత్ రెడ్డి కోరారు. వెంటనే స్పందించిన బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.క్రిష్ణయ్య తాండూరులో బిసిల మద్దతు రోహిత్ రెడ్డికి ఉంటుందని ప్రకటించారు. మంచి చేసిండు..మళ్లీ గెలుస్తావు అంటూ రోహిత్ రెడ్డిని దీవించారు. తాండూరులో బిసిలతో సభ పెట్టండి..ప్రచారంకు వస్తానని కూడా ఆర్.క్రిష్ణయ్య సూచించారు. తాండూరులో బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి మద్దతుగా ఉండి గెలిపించుకోవాలని తాండూరు ప్రాంతానికి చెందిన బిసి సంక్షేమ సంఘం నాయకులకు చెబుతా అని అన్నారు. తాండూరులో బిసి సమీకృత భవన్ నిర్మాణంకు 2 ఎకరాల స్థలం కేటాయించడంతో పాటు రూ.2 కోట్లు కేటాయించిన విషయం తన దృష్టికి వచ్చిందని ఆర్.క్రిష్ణయ్య పేర్కొన్నారు.
తాండూరు నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో బిసి ఓటర్లు ఉన్నారు. తాజా పరిణామాలతో బిసిల ఓటు బ్యాంకు బిఆర్ఎస్ కు కలిసి వచ్చే అవకాశం ఉంది. తాండూరులో తన అభ్యర్థిత్వంకు మద్దతు ప్రకటించిన.. తాండూరులో ఎన్నికల ప్రచారంకు వస్తానని ప్రకటించిన బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.క్రిష్ణయ్యకు తాండూరు బిఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.