schedule Saturday, September 19, 2026

 మోసపోవద్దు గొసపడతాం..

calendar_today November 1, 2023
person dharshininews
 మోసపోవద్దు గొసపడతాం..
 మోసపోవద్దు గొసపడతాం..! - బీఅర్ఎస్ తోనే రాష్ట్రం సుభిక్షం - జెడ్పీటీసీ ప్రమొదిని రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ ని నమ్మి మోసపోవద్దని ఆ పార్టీ ని నమ్మి ఓటు వేస్తే గొసపడతామని జెడ్పీటీసీ ప్రమొదిని గారు అన్నారు. బుధవారం యాలాల మండలం కోకట్ గ్రామంలో మాజీ ఎంపీపీ కరణం పురసోత్తం రావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లా రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ లతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఇంటి ఇంటికి తిరిగి బీఅర్ఎస్ మ్యానిఫెస్టోలో ని అంశాలను వివరించారు. బీఅర్ఎస్ పార్టీ మళ్లీ మూడవసారి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. స్థానికుడ నా బిడ్డ పైలెట్ రోహిత్ రెడ్డి కి ఓటు వేసి మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తోనే తాండూరు ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటి వరకూ తాండూరు కు అత్యధిక నిధులు తీసుకొచ్చారని పేర్కొన్నారు.