schedule Monday, July 06, 2026

ఎమ్మెల్యేకు మద్దతివ్వొద్దు..!

calendar_today November 1, 2023
person dharshininews
ఎమ్మెల్యేకు మద్దతివ్వొద్దు..!
ఎమ్మెల్యేకు మద్దతివ్వొద్దు..! - నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలి - బీసీ సంఘం నిర్ణయం బీసీలకు వ్యతిరేకం - రాజ్‌ కుమార్‌ సపోర్టును ఖండించిన నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్నికల్లో ఎమ్మెల్యేకు బీసీ సంఘం మద్దతు ఇస్తామని ప్రకటించిన నిర్ణయాన్ని విరమించుకోవాలని తాండూరు బీసీ నేతలు డిమాండ్ చేశారు. బుధవారం తాండూరు పట్టణంలోని సమద్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర సంఘాలకు చెందిన బీసీ నేతలు ఉత్తమ్ చంద్, ప్రభాకర్‌ గౌడ్, నీరజాబాల్ రెడ్డి, మల్లేశం, లొంక నర్సింలు తదితరులు మీడియాతో మాట్లాడారు. బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి మద్దతు ఇస్తామని ప్రకటించడాన్ని ఖండించారు. తాండూరు ఎమ్మెల్యే బీసీలకు చేసిందేమి లేదన్నారు. ఇచ్చిన హామిలను శిలాఫలకాలకే పరిమితం చేశారని అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత బీసీ సంఘాలకు ఇచ్చిన హామిలను విస్మరించారని ఆరోపించారు. తెలంగాణ సర్కారు ప్రవేశ పెట్టిన బీసీ బందులో కమీషన్లకు ఆశపడ్డారని ఆరోపించారు. అదేవిధంగా తాండూరులో బీసీ నేతగా మంచి పేరున్న రాజ్ కుమార్ సంఘం ద్వారా ఎమ్మెల్యే బలమైన నాయకుడు అని పేర్కొంటు ఎన్నికల్లో మద్దతు ఇస్తామని పేర్కొనడం శోచనీయమన్నారు. ఆర్. కృష్ణయ్య కూడా మద్దతు ఇస్తామని చెప్పిన వెసక్కి తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యే ముందు బీసీల ఆత్మగౌరవం తాకట్టు పెట్టేలా, మనోభావాలకు వ్యతిరేకంగా నిర్ణయాన్ని ప్రకటించుకోవడం సమంజసం కాదన్నారు. కావాలంటే రాజ్ కుమార్ పార్టీ కండువా వేసుకుని ఎమ్మెల్యే కోసం ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షు బంటు వేణుగోపాల్, కార్యదర్శి రాము ముదిరాజ్, తాండ్ర రాకేష్, తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/21451/