schedule Monday, July 06, 2026

నామినేషన్లకు వేళాయే..!

calendar_today November 2, 2023
person dharshininews
నామినేషన్లకు వేళాయే..!
నామినేషన్లకు వేళాయే..! - తాండూరులో ఏర్పాట్లు - రేపటి నుంచే స్వీకరణ ప్రక్రియ - నిబంధనలు ఏమున్నాయంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ఘట్టం అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియకు వేళ అయ్యింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రేపటి నుంచి ఈనెల 10వ తేది వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరగనుంది. వికారాబాద్ జిల్లాలోని తాండూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. ఆర్డీఓ, రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ నేపద్యంలో తరలివచ్చే అభ్యర్థులతో పాటుగా, సామాన్య పౌరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని నిబంధనలు అమలు చేయనున్నారు. రిటర్నింగ్ కార్యాలయం వద్ద 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ విధించనున్నారు. నామినేషన్ దాఖలు చేయాలనుకునే అభ్యర్థి తోపాటుగా కేవలం ఐదుగురిని మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తారు. ఉదయం 11 గంటల సమయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరించే ప్రక్రియ కొనసాగుతుంది. ఎలక్షన్ కమిషన్ నిర్ణయించిన నిర్ణీత సమయానికి కార్యాలయంలో ఉన్న అభ్యర్థుల నామినేషన్లను స్వీకరిస్తారు. ప్రతి అభ్యర్థి విధిగ తన పేరిట బ్యాంకు ఖాతా తెరవాల్సిన ఉంటుంది. నామినేషన్లు స్వీకరించే మొదటి రోజు నుంచి ప్రక్రియ ముగిసే వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/21457/