schedule Saturday, September 19, 2026

తాండూరు టికెట్ బీజేపీకే ఇవ్వాలి

calendar_today November 3, 2023
person dharshininews
తాండూరు టికెట్ బీజేపీకే ఇవ్వాలి
తాండూరు టికెట్ బీజేపీకే ఇవ్వాలి - జనసేనకు ఇవ్వడంలో పునరాలోచన తప్పనిసరి - పార్టీలో ఎవ్వరికి ఇచ్చినా కలిసి పనిచేస్తాం - బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ తాండూరు అసెంబ్లీ టికెట్ ను కమలంకే కేటాయించాలని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన తాండూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా తాండూరు టికెట్ ను జనసేనకు కేటాయిస్తున్న ప్రకటన రావడంతో నేతలు, కార్యకర్తలు నిరాశకు గురయ్యారని అన్నారు. బలమైన క్యాడర్ ఉన్న బీజేపీని కాదని ఎలాంటి క్యాడర్ లేని జనసేనకు ఇస్తుండడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీలో తనతో పాటు ఎంతో మంది సీనియర్ నేతలు, నాయకులు బీజేపీ బలోపేతానికి కృషి చేశారని గుర్తుచేశారు. తనను కాకుండా పార్టీలో సమర్థవంతమైన నాయకునికి పార్టీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని. ఎవరికి టికెట్ ఇచ్చిన కలిసి కట్టుగా పనిచేస్తామని అన్నారు. తాండూరు టికెట్ ను జనసేనకు కేటాయించడంలో పునరాలోచన చేయాలని పార్టీ హైకమాండ్ ను డిమాండ్ చేశారు. బీజేపీకే తాండూరు టికెట్ వచ్చేలా రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర సహాయ హోం శాఖ మంత్రి కిషన్ రెడ్డిని ఒప్పిస్తామన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, యువనాయకులు అయోమయం చెందకుండా సమన్వయం పాటించాలన్నారు. తాండూరుకు బీజెపీ టికెట్ కేటాయించుకుంటే పార్టీ అదేశాల మేరకు నడుచుకుందామని అన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/21494/