schedule Friday, September 18, 2026

పైలెట్ కు డాక్టర్లు అందరు సహకరించాలి

calendar_today November 4, 2023
person dharshininews
పైలెట్ కు డాక్టర్లు అందరు సహకరించాలి
పైలెట్ కు డాక్టర్లు అందరు సహకరించాలి - ఐఎంఏ అసోసియేషన్ తో ఎమ్మెల్యే తల్లి, సతీమణి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వైద్యలందరు సహకరించాలని ఎమ్మెల్యే తల్లి, జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి, సతీమణి ఆర్తి రెడ్డిలు కోరారు. శుక్రవారం రాత్రి తాండూరులోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) కు చెందిన వైద్యులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరులో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న మాతా శిశు ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ఆసుపత్రి వైద్య సేవలను కార్పోరేట్ కు ధీటుగా అందేలా చేశారని అన్నారు. వైద్యుల సమస్యల పరిష్కారానికి కూడా చొరవ చూపారని అన్నారు. తాండూరును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి వైద్యులందరు సహకరించాలని కోరారు. ఇందుకు వైద్యులు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అసోసియేషన్ సభ్యులు డా. జయప్రసాద్, డా. రమణబాబు, డా. జగదీశ్వర్ రెడ్డి. డా. మల్లికార్జున్, డా. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/21536/