schedule Saturday, September 19, 2026

అన్ని వర్గాల సంక్షేమానికి కృషి

calendar_today November 5, 2023
person dharshininews
అన్ని వర్గాల సంక్షేమానికి కృషి
అన్ని వర్గాల సంక్షేమానికి కృషి - తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి - ఎమ్మెల్యేకు సెంట్రింగ్ కార్మికుల సపోర్టు తాండూరు, దర్శిని ప్రతినిధి : అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేసే బాధ్యత నాదే అని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని సెంట్రింగ్ కార్మికులతో ప్రజా దీవేన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా తాండూరును అభివృద్ధి చేయడం పట్ల గర్వంగా ఉందన్నారు. రూ. 1600 కోట్లతో తాండూరు ప్రజలకు ఇచ్చిన హామి మేరకు రూపు రేఖలు మార్చడం జరిగిందన్నారు. అదేవిధంగా అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేయడం జరిగిందన్నారు. సెంట్రింగ్ కార్మికులు తనకు అండగా నిలిస్తే వారి సమస్యలను బాధ్యతగా పరిష్కరిస్తానని అన్నారు. ఎన్నికల్లో తనకు బంపర్ మెజార్టీ అందించేలా తోడ్పాటు అందించాని విజ్ఞప్తి చేశారు. మరోవైపు సెంట్రింగ్ కార్మికులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి పూర్తి సపోర్టు అందించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/21570/