schedule Monday, July 06, 2026

బీఆర్ఎస్‌కు గుణపాఠం తప్పదు

calendar_today November 6, 2023
person dharshininews
బీఆర్ఎస్‌కు గుణపాఠం తప్పదు
బీఆర్ఎస్‌కు గుణపాఠం తప్పదు - డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి - కాంగ్రెస్‌లో చేరిన గాజుల మన్నన్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి: ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం తప్పదని కాంగ్రెస్ పార్టీ తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, యాలాల మండల బీసీ సంఘం నాయకులు లక్ష్మణ్‌ చారి ఆధ్వర్యంలో యాలాల మండలానికి చెందిన యువనాయకులు గాజుల మన్నన్‌ తిరిగి హస్తం గూటికి చేరుకున్నారు. డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి అతనికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ 9 ఏండ్లుగా నిరంకుశ, మోస పూరిత పాలన చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రజలే బుద్ది చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/21589/