schedule Monday, July 06, 2026

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

calendar_today November 7, 2023
person dharshininews
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి - కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం - ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి - బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు మండలం చేంగోల్ గ్రామానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో బీఅర్ఎస్ పార్టీలో చేరారు. సర్పంచ్ మల్లేశ్వరి శేకర్ గౌడ్, సీనియర్ నాయకులు వేణు గౌడ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండువా కప్పి ఆహ్వానించారు.   ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. బీఅర్ఎస్ మానిఫెస్టో ను ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ మోసాలను బయటపెట్టాలన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తాండూరుకు అత్యధిక నిధులు తీసుకువచ్చిన విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.