schedule Saturday, September 19, 2026

ఐదో రోజు రెండు నామినేషన్లు

calendar_today November 7, 2023
person dharshininews
ఐదో రోజు రెండు నామినేషన్లు
ఐదో రోజు రెండు నామినేషన్లు - స్వతంత్ర అభ్యర్థుల నుంచి స్వీకరణ - ప్రకటించిన ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం ఐదో రోజు రెండు నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి, తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ రెండు స్వతంత్ర అభ్యర్థుల నుంచి నమోదయ్యాయని వెల్లడించారు. ఇందులో జై సింగ్, రాథోడ్ ఆనంద్ నాయక్ లు అనే ఇద్దరు నామినేష్లు వేసినట్లు వెల్లడించారు. ఈనెల 3 నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియలో ఇప్పటి వరకు 8 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మనోహర్ రెడ్డి, బీఎస్పీ నుంచి బోయిని చంద్రశేఖర్, డీఎస్పీ నుంచి గౌరి శ్రీశైలం, స్వతంత్రులుగా మహమ్మద్ రిజ్వాన్, శ్రీ గోపాల్, బీ.రాములు ఇదివరకే వేయగా మంగళవారం జైసింగ్, రాథోడ్ ఆనంద్ లు నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/21643/