schedule Thursday, September 17, 2026

ఎన్నికల్లో పైలెట్ దే గెలుపు

calendar_today November 10, 2023
person dharshininews
ఎన్నికల్లో పైలెట్ దే గెలుపు
ఎన్నికల్లో పైలెట్ దే గెలుపు - రోహిత్ రెడ్డికి మద్దతు తెలిపిన శంకర్ నాయక్ పవార్ - వాసు పవార్‌తో కలిసి భేటి అయిన ఎమ్మెల్యే తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పైలెట్ రోహిత్ రెడ్డిదే విజయం అని రాష్ట్రపతి అవార్డు గ్రహీత. ఆల్ ఇండియా బంజార సంఘం నాయకులు శంకర్ నాయక్ పవార్ అన్నారు. శుక్రవారం తాండూరులో శంకర్ నాయక్ పవార్, భూకైలాస్ వ్యవస్థాపకులు వాసు పవార్ నాయక్ లతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి భేటి అయ్యారు. ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపాలని కోరారు. ఇందుకు శంకర్ నాయక్ పవార్ స్పందించి ఎన్నికల్లో మద్దతుగా ఉంటామని భరోసా ఇచ్చారు. భారీ మెజార్టీతో పైలెట్ రోహిత్ రెడ్డి గెలుపు ఖాయమని' దీవించారు. ఇందుకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/21787/