schedule Monday, July 06, 2026

తండాలకు పంచాయతీ గుర్తింపు బీఆర్ఎస్ ఘనత దే..!

calendar_today November 11, 2023
person dharshininews
తండాలకు పంచాయతీ గుర్తింపు బీఆర్ఎస్ ఘనత దే..!
తండాలకు పంచాయతీ గుర్తింపు బీఆర్ఎస్ ఘనత దే..! - ఎమ్మెల్యే సహకారంతో ప్రతి తండాకు రూ.50 లక్షలు - ఎన్నికల ప్రచారంలో జెడ్పిటిసి ప్రమోదిని రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తండాలను పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత బీఅర్ఎస్ దేనని జెడ్పీటీసీ ప్రమోదిని అన్నారు. బీఅర్ఎస్ సీనియర్ నాయకులు వాసు పవార్, తాండూరు బీఅర్ఎస్ మహిళా అధ్యక్షురాలు శకుంతల తో కలిసి జెడ్పీటీసీ ప్రమోదినీ ఈరోజు యాలాల మండలం రేల్లగడ్డ తండా, పేర్కంపల్లి తండాలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఅర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను ఆమె తండా వాసులకు వివారించారు. మూడవసారి కేసిఆర్ ముఖ్యమంత్రి, మళ్ళీ తాండూరులో రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే గా అవగానే అమలు చేసే మానిఫెస్టో తెలియజేశారు. ప్రతి తండాకు 2 సంవత్సరాల్లో రూ.50 లక్షలు మంజూరు చేసింది ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా కనీస సదుపయాలు లేక తండా వాసులు ఇబ్బంది చూసి బీ అర్ ఎస్ పార్టీ వచ్చాక నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తుందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి మరోసారి పట్టం కట్టాలని అని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/21798/