schedule Thursday, September 17, 2026

కాంగ్రెస్ పార్టీని నమ్మితే ఆగమే

calendar_today November 11, 2023
person dharshininews
కాంగ్రెస్ పార్టీని నమ్మితే ఆగమే
కాంగ్రెస్ పార్టీని నమ్మితే ఆగమే - తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి - బీఆర్ఎస్ పార్టీలో చేరిన పట్టణం, మండల కార్యకర్తలు తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలు బక్వాస్ అని, ఆ పార్టీని నమ్మితే ఆగమవడం ఖాయమని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శనివారం బీఆర్ఎస్ పార్టీలో వివిధ పార్టీల నుంచి భారీగా చేరికలు జరిగాయి. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో పట్టణంలోని 6వ వార్డుకు చెందిన మహిళలు గులాబీ పార్టీలో చేరారు. అదేవిధంగా తాండూరు మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ హసన్ పటేల్, జిల్లా కోఆప్షన్ సభ్యుల ఫోరం ఉపాధ్యక్షులు శంషోద్దీన్ ల ఆధ్వర్యంలో మండలంలోని చెంగోల్, ఓగిపూర్ గ్రామాలకు చెందిన యువకులు, గ్రామస్తులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు, యువకులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. వారికి అండగా ఉంటామన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రజలను మభ్య పెడుతుందన్నారు. ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలు బక్వాస్ అన్నారు. హస్తంను నమ్మితే ఆగమవుతారన్నారు. తాండూరు ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. తాను మరణిస్తే తాండూరులోనే బొంద పెడతారని అన్నారు. బయటోన్ని నమ్మి మోసపోవద్దన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/21808/