schedule Monday, July 06, 2026

'గ్లాసు'కు గ్యారెంటీ లేనట్టేనా..?

calendar_today November 13, 2023
person dharshininews
'గ్లాసు'కు గ్యారెంటీ లేనట్టేనా..?
'గ్లాసు'కు గ్యారెంటీ లేనట్టేనా..? - గుర్తు కేటాయింపులో సందిగ్దత - తాండూరు ఎన్నికల అధికారి ఏమన్నారంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లా తాండూరులో ఉమ్మడిగా పోటీచేస్తున్న బీజేపీ, జనసేన పార్టీ అభ్యర్థి విషయంలో అయోమయం ఇంకా వీడలేదు. ఆ పార్టీకి గుర్తు కేటాయింపు విషయంలో సందిగ్దత తొలగలేదు. తాండూరు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పొత్తుతో జనసేన అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. నామినేషన్ల పర్వంలో ఆయన సమర్పించిన తొలిసెట్‌లో జనసేన బీ ఫారం సమర్పించలేదు. దీంతో ఆయనకు జనసేన పార్టీ గ్లాసు గుర్తు వస్తుందో లేదో అని తీవ్ర చర్చ జరిగింది. అయితే తాజాగా ఈ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. సోమవారం నామినేషన్ల పరిశీలన పర్వం ముగిసిన తరువాత తాండూరు ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమీషన్‌ నుంచి జనసేన అభ్యర్థికి సంబంధించిన ఉత్తర్వులు రాలేదని గుర్తుచేశారు. దీంతో ఆయనకు గ్లాసు గుర్తు కేటాయింపు విషయంలో సందిగ్దత ఏర్పడిందన్నారు. ఎన్నికల్లో గుర్తులు కేటాయింపు సమయం వరకు ఎన్నికల కమీషన్‌ నుంచి ఉత్తర్వులు రాకపోతే ఆయన్ను స్వతంత్ర అభ్యర్థిగా గుర్తించడం జరుగుతుందని పేర్కొన్నారు. నీర్ణీత గడుపులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచిచూడాల్సిందే. ఇదికూడా చదవండి... https://dharshininews.com/21854/