schedule Monday, July 06, 2026

ఆరు గ్యారెంటీలతో పేదల సంక్షేమం

calendar_today November 14, 2023
person dharshininews
ఆరు గ్యారెంటీలతో పేదల సంక్షేమం
ఆరు గ్యారెంటీలతో పేదల సంక్షేమం - కాంగ్రెస్ పార్టీకి అందరు అవకాశం ఇవ్వాలి - తాండూరు పట్టణంలో నేతల విస్తృత ప్రచారం తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలతో పేదల సంక్షేమం సాధ్యవుతుందని ఆ పార్టీ నేతలు అన్నారు. మంగళవారం తాండూరు పట్టణం సాయిపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి తరుపున మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు ప్రచారం నిర్వహించారు. సాయిపూర్ లో నివాసం ఉంటున్న డీసీసీబీ జిల్లా డైరెక్టర్ సంగెం రవీందర్ గౌడ్, తాండూరు ఎంపీపీ అనితా గౌడ్ నివాసం వద్దకు వెళ్లి కాంగ్రెస్ కరపత్రాలను అందజేశారు. అనంతరం వార్డు ప్రజలతో కలిసి ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమాన్ని ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించిందన్నారు. మహిళలకు ఆర్థిక సాయం. రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఉచిత ప్రయాణం, రైతులకు భరోసా కింద పెట్టుబడి, ఆర్థిక సాయం, యువతకు భృతి, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు పథకాలను పార్టీ అధికారంలోకి వస్తే పక్కాగా అమలు చేస్తుందన్నారు. దీంతో పేదల సంక్షేమం సాధ్యమవుతోందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, నేతలు శ్రీనివాస్ గౌడ్, శ్యామప్ప తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి.. https://dharshininews.com/21919/