schedule Thursday, September 17, 2026

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట

calendar_today November 14, 2023
person dharshininews
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట - బీఆర్ఎస్ పార్టీకి అందరు అండగా నిలవాలి - పైలెట్ రోహిత్ రెడ్డిని గెలిపించుకోవాలి - ప్రచారంలో ఎమ్మెల్యే సతీమణి ఆర్తి రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణాలో బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణీ ఆర్తి రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శోభారాణి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే సతీమణి ఆర్తి రెడ్డి పాల్గొని ముస్లిం మహిళలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్ద పీట వేసిందన్నారు. షాదీముభారక్ పథకంతో పాటు పండగలకు కానుకలు అందించిందన్నారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముస్లిం సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారని అన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి.. https://dharshininews.com/21922/