schedule Thursday, September 17, 2026

యూత్ కాంగ్రెస్‌ అధ్యక్షులుగా కావలి సంతోష్‌ కుమార్

calendar_today November 16, 2023
person dharshininews
యూత్ కాంగ్రెస్‌ అధ్యక్షులుగా కావలి సంతోష్‌ కుమార్
యూత్ కాంగ్రెస్‌ అధ్యక్షులుగా కావలి సంతోష్‌ కుమార్ - నాయకులతో చేతుల మీదుగా నియామకపత్రం తాండూరు, దర్శిని ప్రతినిధి: యూత్ కాంగ్రెస్ తాండూరు నియోజకవర్గ అధ్యక్షులుగా కావలి సంతోష్‌ కుమార్ నియామకం అయ్యారు. గతంలో అధ్యక్షులుగా ఉన్న బోయ అశోక్ బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. దీంతో ఆయన కావలి సంతోష్‌ కుమార్‌ను తాండూరు నియోజకవర్గ అధ్యక్షులుగా నియమించారు. పార్టీ నేతల చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా కావలి సంతోష్ కుమార్ మాట్లాడుతూ డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సతీష్ రెడ్డి, పట్టణ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, హేమంత్‌ కుమార్‌ల సహాకారంతో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు రాజుగౌడ్, శ్రీనివాస్, భరత్‌ రెడ్డి, జగదీస్‌ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి.. https://dharshininews.com/21980/