schedule Thursday, September 17, 2026

కారు హోరు.. చేరికలు జోరు..!

calendar_today November 18, 2023
person dharshininews
కారు హోరు.. చేరికలు జోరు..!
కారు హోరు.. చేరికలు జోరు..! - బీఅర్ఎస్ లో చేరుతున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు బీఅర్ఎస్ లో చేరికలతో కారు మరింత జోరు అందుకుంది. శుక్రవారం రాత్రి పెద్దేముల మండల బీజేపీ నాయకుడు కందేనెల్లి విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నాయకత్వంలో పని చేసేందుకు పార్టీలో చేరుతున్నట్టు ఆయన తెలిపారు. అదేవిధంగా తాండూరు పట్టణానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఅర్ఎస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ లో బయటి వ్యక్తుల వల్ల స్థానిక కార్యకర్తలకు విలువ లేదన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడ్డా గుర్తింపు లేదన్నారు. మరోవైపు తాండూరులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పనులు చూసి బీఅర్ఎస్ లో చేరుతున్నట్టు వారు తెలిపారు.   ఇది కూడా చదవండి..   https://dharshininews.com/22009/