schedule Thursday, September 17, 2026

సంక్షేమాన్ని మరువొద్దు..!

calendar_today November 23, 2023
person dharshininews
సంక్షేమాన్ని మరువొద్దు..!
సంక్షేమాన్ని మరువొద్దు..! - ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేయండి - ప్రచారంలో ఎమ్మెల్యే సతీమణీ ఆర్తి రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీని, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని మరవొద్దని ఆయన సతీమణి ఆర్తి రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం తాండూరు పట్టణంలోని 18వ వార్డులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తరుపున ప్రచారం చేశారు. వార్డులో ఇంటింటికి తిరిగి మహిళలను, పెద్ద మనషులను కలిశారు. బీఆర్ఎస్ కరపత్రాలను పంచుతూ పైలెట్ రోహిత్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. అదేవిధంగా తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని వి వరించారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని మరువొద్దని కోరారు. డమ్మీ ఈవీఎంను పట్టకుని ఎన్నికల్లో మొదటి స్థానంలో ఉన్న కారు గుర్తుకే ఓటేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షురాలు సంగీత ఠాకూర్, కౌన్సిరల్ అశ్విని గుండప్ప, స్టేషన్ హనుమాన్ దేవాలయ చైర్మన్ సంజీవరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22161/