schedule Thursday, September 17, 2026

బీసీల పక్షపాతి పైలెట్..!

calendar_today November 26, 2023
person dharshininews
బీసీల పక్షపాతి పైలెట్..!
బీసీల పక్షపాతి పైలెట్..! - అన్ని వర్గాల కోసం సాటిలేని సంక్షేమం - అభివృద్ధి చేస్తున్న రోహిత్ రెడ్డిని ఆదరించాలి - బీసీ సంఘం జా. కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ - ప్రచారంలో కలిసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: బీసీ కులాల అభ్యున్నతికి కృషి చేస్తూ తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బీసీల పక్షపాతిగా మారారని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీసీ సంఘం ఆధ్వర్యంలో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం కందుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో సంఘం నేతలు ప్రచారం చేస్తున్నారు. పెద్దేముల్ మండలంలోని తట్టపల్లి, బండమీదిపల్లి, అడిగిచర్ల, గోపాల్‌పూర్, మారేపల్లి, నర్సాపూర్, రుద్రారం తదితర గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు అందించి రోహిత్ రెడ్డికే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం తాండూర్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ఎంతటి పెద్దవారైనా చిన్నవారైనా, ఏ సమస్య అయినా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దృష్టికి తెచ్చిన వెంటనే ఓపికతో వినడమే కాకుండా వారి సమస్యను పరిష్కరించడంలో రోహిత్ రెడ్డిని మించిన వారు లేరని అభివర్నించారు. సబ్బండ వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్న పైలట్ రోహిత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించుకుందామని అన్నారు. మండలంలో చేస్తున్న ప్రచారంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్గొని నేతలను ఉత్సహా పరిచారు. అనుకోకుండా వచ్చిన ఎమ్మెల్యే చూసి నేతలు వెల్లువలా ప్రచారంను చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకుర్, తట్టేపల్లి వైస్ చైర్మన్ అంజి, బీసీ నాయకులు రాము ముదిరాజ్, బసవరాజ్, గడ్డం వెంకటేష్, సోయల్, సురేందర్, హరి ప్రసాద్, వెంకట్, రాజు, బాబు మియా, నాని, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22263/