schedule Thursday, September 17, 2026

ఇంట్లో మద్యం కాటన్లు..!

calendar_today November 26, 2023
person dharshininews
ఇంట్లో మద్యం కాటన్లు..!
ఇంట్లో మద్యం కాటన్లు..! - ఎక్సైజ్ పోలీసుల దాడులతో గుట్టు రట్టు - తాండూరు మండలంలో సంఘటన - పట్టుబడిన బాటిళ్లు ఎన్ని, విలువ ఎంతంటే..? తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఎన్నికల నేపథ్యంలో ఇంట్లో గుట్టుగా మద్యం బాటిళ్ల సరఫరాకు పాల్పడుతున్న వ్యక్తిపై తాండూరు ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. తాండూరు ఎక్సైజ్ సీఐ అనంతయ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం ఓగిపూర్ గ్రామంలో జెట్టి గోపాల్ అనే వ్యక్తి ఇంట్లో మద్యం బాటిళ్ల సరఫరా చేస్తున్నారని సమాచారం అందింది. ఈ మేరకు ఆదివారం ఎక్సైజ్ సీఐ అనంతయ్య ఆధ్వర్యంలో సిబ్బంది గోపాల్ ఇంట్లో దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో నాలుగు కాటన్లలో 48 కేఎఫ్ స్ట్రాంగ్ బాటిళ్లు, ఒక కాటన్ లో 48 ఐబీ బాటిళ్లు లభ్యమయ్యాయి. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు అక్రమంగా మద్యం సరఫరాకు పాల్పడుతున్న కారణంగా జెట్టి గోపాల్ పై కేసు నమోదు చేసినట్లు సీఐ అనంతయ్య తెలిపారు. దాడుల్లో స్వాదీనం చేసుకున్న మద్యం బాటిళ్లను విలువ రూ.17 వేల 300లు ఉంటుందని వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా మద్యం విక్రయాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22266/