schedule Monday, September 14, 2026

కాంగ్రెస్ నేతలు, కార్యక్తల కృషితో విజయం

calendar_today December 3, 2023
person dharshininews
కాంగ్రెస్ నేతలు, కార్యక్తల కృషితో విజయం
కాంగ్రెస్ నేతలు, కార్యక్తల కృషితో విజయం - తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా - ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్టీ నేతలు, కార్యకర్తల కృషితోనే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం అసెంబ్లీ పోరు ఫలితాలు వెల్లడైన తరువాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిపై విజయం సాధించారు. అనంతరం మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తన విజయం కోసం అహర్నిషలు శ్రమించారని అన్నారు. వారి కృషి వల్లే విజయం సాధించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యేగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో తాండూరులో అభివృద్ధి, విద్యా, వ్యాపారం, వైద్య రంగాలలో పురోగతి సాధించేలా కృషి చేస్తానని అన్నారు. తన విజయానికి కారుకులైన నేతలు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22383/