schedule Monday, September 14, 2026

మూడు టీంలు, రోజుకు ఆరు వార్డులు..!

calendar_today December 27, 2023
person dharshininews
మూడు టీంలు, రోజుకు ఆరు వార్డులు..!
మూడు టీంలు, రోజుకు ఆరు వార్డులు..! - మున్సిపల్ లో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ - షెడ్యూల్ ప్రకటించిన అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రజా పాలన ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణకు తాండూరు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేశారు. గురువారం నుంచి తాండూరు పట్టణంలో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుంది. ప్రతి వార్డులో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాండూరు పట్టణంలోని 36 వార్డులను దృష్టిలో ఉంచుకుని మూడు టీంలను ఏర్పాటు చేశారు. రోజుకు ఆరు వార్డుల చొప్పున వారం రోజుల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉదయం మూడు వార్డులు, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మూడు వార్డులు మొత్తం 6 వార్డుల్లో పూర్తి చేయాలని చర్యలు తీసుకున్నారు. తాండూరు మున్సిపల్ ప్రత్యేకాధికారి, కమిషనర్ పర్యవేక్షణలో దరఖాస్తుల స్వీకరణ జరుగుతోందని అధికారులు ప్రకటించారు. వార్డుల వారిగా షెడ్యూల్ ఇలా... ఇది కూడా చదవండి... https://dharshininews.com/22766/