schedule Tuesday, July 07, 2026

దరఖాస్తులు అమ్మితే కఠిన చర్యలు

calendar_today December 29, 2023
person dharshininews
దరఖాస్తులు అమ్మితే కఠిన చర్యలు
దరఖాస్తులు అమ్మితే కఠిన చర్యలు - తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆరు గ్యారెంటీల అభయహస్తం దరఖాస్తులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని తాండూరు ఆర్డీఓ, నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు హెచ్చరించారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా గురువారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు జిరాక్స్ సెంటర్ వ్యాపారులు, ఇతర వ్యక్తులు దరఖాస్తు ఫారాలను డబ్బులకు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వస్తుందన్నారు. ఎవరైనా అమ్మకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో, వార్డుల్లో అధికారులు లేదా సిబ్బంది వచ్చి దరఖాస్తు ఫారాలను అందజేస్తారని, లబ్దిదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22789/