schedule Tuesday, July 07, 2026

పేదలను ఆదుకోవడమే కాంగ్రెస్ లక్ష్యం

calendar_today December 29, 2023
person dharshininews
పేదలను ఆదుకోవడమే కాంగ్రెస్ లక్ష్యం
పేదలను ఆదుకోవడమే కాంగ్రెస్ లక్ష్యం - తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి - రెండో ప్రజా పాలనలో పాల్గొన్న ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీల అభయ హస్తంను సద్వినియోగం చేసుకోవాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం రెండో రోజు తాండూరు పట్టణం 9వ వార్డు సాయిపూర్లో చేపట్టిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలను ఆదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్షమన్నారు. ఎన్నికల్లో హామి ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసమే ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిందన్నారు. ఆరోగ్య శ్రీ మినహాయించి మిగతా ఐదు గ్యారెంటీల పథకాలకు అర్హులైన పేదలందరు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. తెల్ల రేషన్ కార్డు లేకున్నా ఆధార్ కార్డుతో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సస్ పట్లోళ్ల దీపా నర్సింలు, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, కౌన్సిలర్లు నీరజా బాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, సాయిపూర్ బాల్ రెడ్డి, బంటు మలప్ప, బంటు వేణుగోపాల్, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, డీఈ ఖాజా హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22799/