schedule Tuesday, July 07, 2026

దరఖాస్తుల దోపిడీపై సీరియస్..!

calendar_today December 30, 2023
person dharshininews
దరఖాస్తుల దోపిడీపై సీరియస్..!
దరఖాస్తుల దోపిడీపై సీరియస్..! - విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ - చర్యలకు సిద్ధమైన అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : దరఖాస్తుల దోపిడి కథనంపై వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రజా పాలన ఆరు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తుల ఫారాల విక్రయాలపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. తాండూరు పట్టణం వినాయక్ చౌక్ సమీపంలోని ప్రొఫెషనల్ కోరియర్ కమ్ మీసేవా కేంద్రంలో నిర్వహకులు విక్రయిస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. శనివారం ఈ సంఘటనపై విచారణ చేపట్టి నివేధిక అందించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తాండూరు తహసీల్దార్ తారాసింగ్ ను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు నిర్వహకులను విచారించారు. దరఖాస్తు పారాలను ఎందుకు విక్రయించారని నిర్వహకులను ప్రశ్నించారు. ఈ నివేధికను జిల్లా కలెక్టర్ కు అందజేయనున్నట్లు విచారణ అధికారులు తెలిపారు. నివేధిక ఆధారంగా నిర్వహకులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మరోవైపు ఈ సంఘటనతో నిర్వహకులు తమ కేంద్రంలో విక్రయాలను నిలిపివేశారు. పరిమిత కట్టడితో కేంద్రాన్ని నిర్వహించుకున్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22826/