schedule Tuesday, July 07, 2026

మూడో రోజు 3485 దరఖాస్తులు

calendar_today December 30, 2023
person dharshininews
మూడో రోజు 3485 దరఖాస్తులు
మూడో రోజు 3485 దరఖాస్తులు - మున్సిపల్‌లో కొనసాగుతున్న ప్రజా పాలన - ఆర్జీలు స్వీకరించిన అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పరిధిలో మూడో రోజు ప్రజా పాలనలో 3485 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజల నుంచి అభయ హస్తం ద్వార దరఖాస్తులను స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. శనివారం మూడో రోజు పట్టణంలోని 13వ వార్డు, 14వ వార్డు, 15వ వార్డు, 16వ వార్డు, 17వ వార్డు, 18వ వార్డులలో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగింది. 13వ వార్డులో 499, 14వ వార్డులో 811, 15వ వార్డులో 440, 16వ వార్డులో 497, 17వ వార్డులో 560, 18వ వార్డులో 384 దరఖాస్తులతో పాటు ఇతర వార్డుల నుంచి మరో 294 దరఖాస్తులు అందగా మొత్తం 3485 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ కమీషనర్ షఫీవుల్లా, మేనేజర్ సరేందర్ రెడ్డి, డీఈ ఖాజా హుస్సేన్, పలు శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22831/