schedule Tuesday, July 07, 2026

రండమ్మ.. రండి..!

calendar_today December 31, 2023
person dharshininews
రండమ్మ.. రండి..!
రండమ్మ.. రండి..! - మహలక్ష్మీకి కులం, ఆధాయం చేస్తాం - గ్రామాల్లో ఆన్‌లైన్‌ వ్యాపారుల మోసం - దృష్టిసారించని అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : రండమ్మా.. రండి.. మేమూ మహాలక్ష్మీకి అవసరమయ్యే కులం, ఆధాయం సర్టిఫికెట్లను ఆప్లై చేస్తామంటూ ఆన్‌లైన వ్యాపారులు మోసానికి తెగబడుతున్నారు. ఈ సంఘటన పెద్దేముల్ మండలంలో వెలుగులోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం ఇటీవల అభయ హస్తం ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా మహాలక్ష్మీ పథకం కింద కొత్త రేషన్ కార్డులు, రూ. 500లకు గ్యాస్ సిలిండర్ పథకాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకోసం లబ్దిదారులు మీసేవా, ఆన్ లైన్ సెంటర్లు, జిరాక్స్ సెంటర్లకు పరుగులు పెడుతున్నారు. దీంతో కేంద్రాలకు వచ్చే వారికి కులం, ఆధాయం సర్టిఫికెట్లు ముందు ముందు అవసరం అవుతాయని నిర్వహకులు లబ్దిదారులను మభ్యపెడుతున్నారు. తాజాగా పెద్దేముల్ మండలంలో ఓ కేంద్రం నిర్వహకుడు దర్జాగా ప్రచార చిత్రాలను అంటించారు. శ్రీ బాలాజీ గ్రాఫిక్స్ పేరుతో చిత్రాలను అంటించి మహాలక్ష్మీ పథానికి అవసరమయ్యే కులం, ఆధాయం సర్టిపికెట్లు దరఖాస్తు చేయిస్తామని, నోటరీలు కూడా చేయిస్తామని ప్రచారం చేస్తున్నారు. ఆదివారం ప్రచార చిత్రాలను అంటించిన వారిని గ్రామస్తులు లదీయడంతో వాళ్లు అక్కడి నుంచి పరారయ్యారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఆన్ లైన్ కేంద్రాల నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22842/