schedule Tuesday, July 07, 2026

ప్రతి ఇంటికి ఆరు గ్యారెంటీలు

calendar_today January 3, 2024
person dharshininews
ప్రతి ఇంటికి ఆరు గ్యారెంటీలు
ప్రతి ఇంటికి ఆరు గ్యారెంటీలు - ప్రజా, పాలనను సద్వినియోగం చేసుకోవాలి - అధికారులు అవినీతికి తావులేకుండా పనిచేయాలి - తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రతి ఇంటికి ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేసి అండగ నిలవడమే కాంగ్రెస్ సర్కారు ధ్యేయమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు మున్సిపల్ పరిధి 25వ వార్డులో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వార్డు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ లతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అంతకుముందు ఏర్పాటు చేసిన సమావేశంలో మనోహర్ రెడ్డి ప్రసంగిస్తూ ఆరు గ్యారెంటీ పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలిచేందుకు బాధ్యతగా పనిచేస్తుందని అన్నారు. ఇందుకోసమే ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో అర్హులైన పేదలకు ఐదు గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు. ప్రజా పాలనను అందరు సద్వనియోగం చేసుకోవాలన్నారు. అధికారులు ఎలాంటి అవినీతికి తావివ్వకుండా పనిచేయాలన్నారు. అర్హులు కూడా దళారులను నమ్మకుండా పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, ఫ్లోర్ లీడర్ మధుబాల, ప్రత్యేకాధికారి వినయ్ కుమార్. నాయకులు అబ్దుల్ రవూఫ్, సాయిపూర్ బాల్ రెడ్డి, కౌన్సిలర్లు బోయరవి, భీంసింగ్, కమీషనర్ షఫీవుల్లా, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/22916/