schedule Tuesday, July 07, 2026

పట్నం వర్సెస్ పైలెట్..!

calendar_today January 5, 2024
person dharshininews
పట్నం వర్సెస్ పైలెట్..!
పట్నం వర్సెస్ పైలెట్..! - బీఆర్ఎస్‌లో మళ్లీ వర్గపోరు - వాగ్వివాదం చేసుకున్న ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే - మాజీ మంత్రి హరిష్‌ రావు ముందు ఘటన హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిల మద్య వర్గపోరు మరోసారి బయటపడింది. ఈసారి నియోజకవర్గంలో కాకుండా ఏకంగా తెలంగాణ భవన్‌లో బహిర్గతమైంది. రానున్న చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో భారాస వర్గపోరు బయటపడింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు మరికొంతమంది సీనియర్ నాయకుల అధ్యక్షతన జరుగుతున్న సమీక్షా సమావేశంలో తాండూరు నియోజకవర్గ నాయకుల మధ్య వివాదం చెలరేగింది. మహేందర్‌ రెడ్డి మాట్లాడే సమయంలో రోహిత్‌ రెడ్డి వర్గం నినాదాలు చేసింది. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని సొంత పార్టీ నాయకులు భ్రష్టు పట్టించారని. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గీయులు మొన్నటి ఎన్నికల్లో పనిచేయకపోవడంతోనే పైలెట్ రోహిత్ రెడ్డి ఓటమి పాలయ్యారని. మహేందర్ రెడ్డి వర్గీయులను ఉద్దేశించి ప్రస్తావించడంతో, మహేందర్ రెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. దీంతో ఇరువర్గాల పరస్పర నినాదాలతో సమావేశం వేడెక్కింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో మాజీ మంత్రి హరీశ్‌రావు కలగజేసుకొని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/22961/