schedule Tuesday, July 07, 2026

అవినీతి, అక్రమాలను సహించము

calendar_today January 6, 2024
person dharshininews
అవినీతి, అక్రమాలను సహించము
అవినీతి, అక్రమాలను సహించము - ఆరు గ్యారెంటీలను బాధ్యతగా అమలు చేస్తాం - తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి  తాండూరు, దర్శిని ప్రతినిధి : అవినీతి, అక్రమాలకు ఎవరు పాల్పడినా సహించేది లేదని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని 34, 35, 36వ వార్డులలో జరిగిన ప్రజా ప్రాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కౌన్సిలర్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఇస్తామని హామి ఇచ్చిందని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. అభయ హస్తం కింద గ్యారెంటీ పథకాలకు అర్హులైన పేదల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుందన్నారు. అర్హులైన పేదలందరికి బాధ్యతగా పథకాలను అమలు చేస్తామన్నారు. మరోవైపు 34వ వార్డులో జరిగిన ప్రజా పాలనలో కౌన్సిలర్ సోమశేఖర్ మాట్లాడుతూ వార్డులో నిర్మాణంలో ఉన్న డ్వాక్రా భవనాన్ని, ఖాళీగా ఉన్న స్థలాలపై కొందరు అక్రమార్కులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకవచ్చారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ అక్రమాలకు ఎవరు పాల్పడిన సహించేది లేదన్నారు. అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే అక్రమాలను తరిమేస్తాని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, నాయకులు డాక్టర్ సంపత్ కుమార్. సాయిపూర్ బాల్ రెడ్డి, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, మున్సిపల్ ప్రత్యేకాధికారి వినయ్ కుమార్, కమీషనర్ షఫీవుల్లా, మేనేజర్ నరేందర్ రెడ్డి, డీఈ ఖాజా, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23009/