schedule Sunday, September 13, 2026

ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

calendar_today January 6, 2024
person dharshininews
ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - ముగిసిన జాతర ఉత్సవాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం వాల్మీకీ నగర్ లో వెలసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దర్శించుకున్నారు. గత రెండు రోజులుగా ఎల్లమ్మ జాతర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం రెండో రోజు జరిగిన జాతర ఉత్సవాలలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దేశాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ చైర్ పర్సన్ సునితా సంపత్, కౌన్సిలర్ అంతారం లలిత, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ తదితరులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటి సభ్యులు ఎమ్మెల్యేతో పాటు నేతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, పలువురు రాజకీయ నేతలు, వార్డు పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23012/