schedule Tuesday, July 07, 2026

ఆధార్ కోసం ఆగమాగం..!

calendar_today January 8, 2024
person dharshininews
ఆధార్ కోసం ఆగమాగం..!
ఆధార్ కోసం ఆగమాగం..! - టోకన్ల కోసం తోపులాట - ఎగబడిన వారిపై తిరగబడిన వైనం - తాండూరు పోస్టాఫీసు వద్ద ఉద్రిక్తత తాండూరు, దర్శిని ప్రతినిధి : అన్నింటికి ముఖ్యమైన ఆధార్ ఆప్ డేట్ కోసం వినియోగదారులు ఆగమాగం అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కోసం ఈకేవైసీ చేయించుకోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే తాండూరులో ఆధార్ ఆప్ డేట్ కు పోస్టాఫీసు ఒక్కటే అందరికి దిక్కయ్యింది. గత కొన్ని రోజులుగా పోస్టాఫీసు వద్ద రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో నిర్వహకులు టోకన్లు జారీ చేస్తున్న వినియోగదారులు తెల్లవారక ముందే పోస్టాఫీసు వద్దకు చేరుకుంటున్నారు. తాజాగా సోమవారం జారీ చేసిన టోకన్ల కోసం వినియోగదారులు పోస్టాఫీసుకు పోటెత్తారు. వృద్ధులు, చిన్నారులు, మహిళలు సైతం పోస్టాపీసుకు వచ్చి బారులు తీరారు. నిర్వహకులు ఇచ్చే కొన్ని టోకన్ల కోసం భారీగా ఎగబడ్డారు. దీంతో ఫోస్టాఫీసు వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టోకన్ల కోసం ఎగబడిన వినియోగదారులపై నిర్వహకులు తిరగబడడంతో తోపులాట జరిగింది. నిర్వహకులు. వినియోగదారుల మద్య వాగ్వివాదం చోటు చేసుకుంది. చివరకు పరిమిత టోకన్లు మాత్రమే అందజేయడంతో మిగతా వినియోగదారులు ఉసూరుమనుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు తాండూరులో ఆధార్ కేంద్రాల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23038/