schedule Sunday, September 13, 2026

ప్రశాంతంగా నవోదయ పరీక్ష

calendar_today January 20, 2024
person dharshininews
ప్రశాంతంగా నవోదయ పరీక్ష
ప్రశాంతంగా నవోదయ పరీక్ష - హాజరైన 288 మంది విద్యార్థులు - గైర్హాజరైన వారి సంఖ్య తెలిస్తే షాక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో జవహార్ నవోదయ పరీక్ష ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. శనివారం నవోదయ ప్రవేశ పరీక్షను దృష్టిలో ఉంచుకుని పట్టణంలోని జీజేసీ ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ నెంబర్ 1 పాఠశాల, నలంద పాఠశాల, సెయింట్ మార్క్స్ పాఠశాలలో సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లలో 938 మంది విద్యార్థులకు ఆలార్ట్ చేశారు. ఉదయం నుంచే వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. నిర్వహణ అధికారులు విద్యార్థులను కేంద్రాలకు అనుమతించారు. మొత్తం 938 మందికి గాను ఆయా సెంటర్లలో కేవలం 288 మంది విద్యార్థులు మాత్రమే హాజరై పరీక్షలు రాశారు. మిగతా 640 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరు అయ్యారు. పరీక్షకు హాజరైన వారి సంఖ్యకంటే గైర్హాజరు అయిన విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండడం గమనార్హం. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23313/