ఓటరు దినోత్సవానికి సర్వం సిద్దం చేయండి
January 24, 2024
dharshininews
ఓటరు దినోత్సవానికి సర్వం సిద్దం చేయండి
- మండల కేంద్రాల్లో ర్యాలీ, మానవహార ప్రదర్శన నిర్వహించాలి
- తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు ఆదేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహణకు సర్వం సిద్దం చేయాలని తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు అన్నారు. బుధవారం తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో తాండూరు, యాలాల బషీరాబాద్, పెద్దేముల్ మండలాల తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆర్డీఓ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ గురువారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి మండల కేంద్రాల్లో విద్యార్థుల్లో ర్యాలీ ర్యాలీ నిర్వహించాలన్నారు. మానవహారం నిర్వహించి ఓటరు ప్రతిజ్ఞ చేయించాలన్నారు. ఓటరు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఏఓ మహేష్ గౌడ్, తహసీల్దార్లు తారాసింగ్, మునీరోద్దీన్, వెంకటస్వామి, కిషన్ నాయక్, ఆశాజ్యోతి, డిప్యూటీ తహసీల్దార్ చాంద్ పాష, రెవెన్యూ సిబ్బంది తరుతరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి...
https://dharshininews.com/23382/