schedule Tuesday, July 07, 2026

ఓటు హక్కు బలమైంది..!

calendar_today January 25, 2024
person dharshininews
ఓటు హక్కు బలమైంది..!
ఓటు హక్కు బలమైంది..! - అందరు దానిని సద్వినియోగ పరుచుకోవాలి - తాండూరు తహసీల్దార్ తారాసింగ్ - ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజ నిర్మాణానికి బలమైన పునాది ఓటు హక్కు అని తాండూరు తహసీల్దార్ తారాసింగ్ అన్నారు. గురువారం తాండూరులో 14వ జాతీయ ఓటరు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఓటరు దినోత్సవం సందర్బంగా తాండూరు చౌరస్తాలో మానవహారం ఏర్పాటు చేశారు. తాండూరు పట్టణానికి పాఠశాలల వి ద్యార్థులు, ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన తహసీల్దార్ తారాసింగ్, రెవెన్యూ అధికారులు, పాఠశాల కళాశాల ప్రి న్సిపల్ లో ఓటరు ప్రతిజ్ఞ చేశారు. ఓటు ఓశక్తి.., సమ సమాజ నిర్మాణానికి సంధించే బ్రహ్మస్తం అని, దీనిని అందరు సద్వినియోగ పరుచుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ఓటు సామాన్య మానవుని వద్ద ఉన్న పాశుపతాస్త్రమని అభివర్ణించారు. ముఖ్యంగా యువత సమర్థవంతమైన నాయకున్ని ఎన్నుకునేందుకు వినియోగించుకోవాలన్నారు. భారతదేశ భవిష్యత్తును పరిరక్షించడంలో ఓటర్ల కీలమని పేర్కొన్నారు. 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు. హక్కను నమోదు చేసుకోవాలని తెలిపారు. ఎన్నికల వేళల్లో నిర్భయంగా తమ ఓటును వినియోగించుకుని మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీప్యూటీ విజయేందర్, ఆర్ ఐ రాజారెడ్డి, పోలీసు అధికారులు, పాఠశాలల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23399/