schedule Tuesday, July 07, 2026

శ్రీ సాయిమేధాలో దూం దాం..గా గణతంత్ర వేడుకలు..!

calendar_today January 26, 2024
person dharshininews
శ్రీ సాయిమేధాలో దూం దాం..గా గణతంత్ర వేడుకలు..!
శ్రీ సాయిమేధాలో దూం దాం..గా గణతంత్ర వేడుకలు..! - హాజరైన ఆర్బీఎల్ ఫ్యాక్టరీ ఎండీ సరళా శ్రీనివాస్ రెడ్డి - విద్యార్థులకు చక్కని సందేశంతో పాటు బహుమతుల అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శివాజీ చౌక్‌లోని శ్రీ సాయిమేధా విద్యాలయలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దూం..దాం..గా నిర్వహించారు. ఈ వేడుకలకు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరుడు శ్రీనివాస్ రెడ్డి సతీమణి, ఆర్బీఎల్ ఫ్యాక్టరీ ఎండీ సరళారెడ్డి హాజరై విద్యార్థులకు చక్కని సందేశంతో పాటు బహుమతులు ప్రధానం చేశారు. శుక్రవారం తాండూరు పట్టణం శ్రీ సాయి మేధ విద్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్.బి.ఎల్ ఎండి సరళరెడ్డి మాట్లాడుతూ సమసమాజ నిర్మాణానికి శ్రీ సాయి మేధ స్కూల్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. చదువుతోపాటు విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం బాగుందన్నారు. విద్యార్థులు శ్రద్ధతో, క్రమశిక్షణతో చదువుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలిపారు. సమాజంలో పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ పెరుమాళ్ళ వెంకట్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23444/