schedule Saturday, September 12, 2026

విద్యార్థులతో చెలగాటమాడితే ఊరుకోం..!

calendar_today January 31, 2024
person dharshininews
విద్యార్థులతో చెలగాటమాడితే ఊరుకోం..!
విద్యార్థులతో చెలగాటమాడితే ఊరుకోం..! - సమయానికి అనుకూలంగా బస్సులు నడపాలి - బీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : చదువుకునే విద్యార్థులతో చెలగాటం ఆడితే ఊరుకునేదిలేదని బీఆర్ఎస్వీ తాండూరు పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి అన్నారు. సమయానికి బస్సులు రాక యాలాల మండలం అగ్గనూరులో విద్యార్థులు దర్నా చేసిన సంఘటనపై స్పందించారు. బుధవారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ విద్యార్థుల పట్ల ఆర్టీసీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సహించలేనిదన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామిని నెరవేర్చామని గొప్పలు పోతున్న ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను గాలికివదిలేయడం పద్దతి కాదన్నారు. తాండూరు పట్టణానికి చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు బస్సుల కోసం 4 గంటలు దర్నా చేయడం విచారకరమన్నారు. దర్నా చేసిన విద్యార్థులను కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో చెలగాటం ఆడాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విద్యార్థుల కోసం సమయానుకూలంగా బస్సులు నడిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆర్టీసీ డీపో ముట్టడించి ఆందోళన ఉదృ చేస్తామన్నారు. ఇదికూడా చదవండి.. https://dharshininews.com/23539/