schedule Tuesday, July 07, 2026

ఆధార్ వినియగదారులకు శుభవార్త..!

calendar_today January 31, 2024
person dharshininews
ఆధార్ వినియగదారులకు శుభవార్త..!
ఆధార్ వినియగదారులకు శుభవార్త..! - కేంద్రాల కొనసాగింపు గడువు పెంపు - ప్రకటించిన తాండూరు ఆర్డీవో శ్రీనివాస్ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజక వర్గ ఆధార్ వినియోగ దారులకు అధికారులు శుభవార్త చెప్పారు. గత కొన్ని రోజులుగా తాండూరు పాత మున్సిపల్ కార్యాలయంలో తాత్కాలిక ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రేషన్ ఈకేవైసి కోసం ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు తాండూరులో వినియోగ దారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, తాండూరు ఎమ్మేల్యే మనోహర్ రెడ్డి చొరవ తో పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో మూడు తాత్కాలిక ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటి గడువు ముగియడంతో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ కేంద్రాల కొనసాగింపు గడువును పొడగిస్తున్నట్లు తాండూరు ఆర్డీవో శ్రీనివాస్ రావు ప్రకటించారు. ఫిబ్రవరి 7వ తేదీ వరకు కేంద్రాలు కొనసాగుతాయని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేంద్రాలను తాండూరు పట్టణం, మండలంలోని ఆధార్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.   ఇదికూడా చదవండి...  https://dharshininews.com/23548/