దేవాలయాలకు నోటిఫికేషన్..!
February 1, 2024
dharshininews
దేవాలయాలకు నోటిఫికేషన్..!
- కొత్త పాలకమండలి సభ్యుల దరఖాస్తుల ఆహ్వానం
- తాండూరులో నాలుగు దేవాలయాలకు ఉత్తర్వులు
- ప్రకటించిన దేవాదాయ శాఖ అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులోని పలు దేవాలయాలకు పాలక మండళ్ల(ట్రస్టు సభ్యుల) నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర దేవాదాయ శాఖ కమీషనర్ ఉత్తర్వులను జారీ చేశారు. తాండూరు పట్టణంలోని నాలుగు దేవాలయాలకు పాలక మండళ్ల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలోని కాళికాదేవి దేవాలయం, బాలాజీ దేవాలయం, సీతారాంపేట్ హనుమాన్ దేవాలయంతో పాటు యాలాల మండల పరిధిలోని రసూల్ పూర్‌లోని హనుమాన్ దేవాలయాలకు కొత్త పాలకమండల సభ్యుల నియామానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు స్పష్టం చేశారు.
నోటీసు జారీ చేసిన 20 రోజుల్లోపు అభ్యర్థుల తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ట్రస్టు సభ్యుల స్ధానాలకు రంగారెడ్డి జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమీషనర్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇదికూడా చదవండి...
https://dharshininews.com/23580/