schedule Saturday, September 12, 2026

ప్రో. కోదండరాంపై కేసీఆర్ కుట్ర

calendar_today February 1, 2024
person dharshininews
ప్రో. కోదండరాంపై కేసీఆర్ కుట్ర
ప్రో. కోదండరాంపై కేసీఆర్ కుట్ర - రేపు కేసీఆర్‌కు వ్యతిరేకంగా నిరసన - టీజేఎస్ తాండూరు ఇంచార్జ్ సోమశేఖర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఉద్యమ కారులు ప్రొఫెసర్ కోదండరాంపై మాజీ సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆ పార్టీ తాండూరు నియోజకవర్గ ఇంచార్జ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సోమశేఖర్ ఆరోపించారు. గురువారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరాం పదవి ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేసేందుకు కేసీఆర్ కుతంత్రాలు పన్నారని అన్నారు. ఉద్యమ నాయకుడు ఎమ్మెల్సీగా వస్తున్నందుకు వణికి పోతున్నారని అన్నారు. అందుకే కోర్టులో కేసు వేయించి నీచ రాజకీయాలను చాటుకున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ అవినీతిని చట్టసభల్లో నిలదీస్తారనే భయంతో గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫ్రోఫెసర్ కోదండరాంను వందల కోట్లు ఖర్చు చేసి ఓడించారని ఆరోపించారు. తాజాగా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయించకుండా కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ నీచ రాజకీయాలకు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా టీజేఎస్ కార్యకర్తలు, ఉద్యమ కారులు, ప్రజా సంఘాలు, స్వామిక వాదులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23585/