schedule Saturday, September 12, 2026

భద్రేశ్వరాలయ అభివృద్ధికి కృషి

calendar_today February 6, 2024
person dharshininews
భద్రేశ్వరాలయ అభివృద్ధికి కృషి
భద్రేశ్వరాలయ అభివృద్ధికి కృషి - పురోగతి కోసం నివేధికలు ఇవ్వండి - తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి -ఆలయంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ నడిబొడ్డున వెలసిన శ్రీ భావిగి భద్రేశ్వర దేవాలయ అభివృద్ధికి బాధ్యతగా కృషి చేస్తానని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని భద్రేశ్వర దేవాలయాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సందర్శించారు. వేదపండితుల మంత్రోచ్చరణల మద్య ఎమ్మెల్యే భద్రేశ్వరునికి పూజలు నిర్వహించారు. పండితులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. అనంతరం ఎమ్మెల్యే దేవాలయణ ఆవరణలో ఉన్న వీరశైవ సమాజం సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా దేవాలయ పురోగతి, ఆలయ చైర్మన్ సభ్యుల గురించి చర్చించారు. తాండూరుకు భద్రేశ్వరాలయం తలమానికమన్నారు. స్వామి ఆశీస్సులతో తాండూరు అన్ని రంగాల్లో ప్రగతిని సాధిస్తుందన్నారు. దేవాలయంను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు బాధ్యత తీసుకుంటానని అన్నారు. ఆలయ అభివృద్ధికి కావాల్సిన నివేధికను తయారు చేసి సమర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీ కృష్ణ గౌడ్, ఆలయ ఈఓ శేఖర్ గౌడ్, కౌన్సిలర్ సోమశేఖర్, వీరశైవ సమాజం అధ్యక్షులు ఆర్.బస్వరాజ్, సభ్యులు పటేల్ శ్రీశైలం, జొన్నల బస్వరాజ్, ఆలయ పూజారులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23636/