schedule Tuesday, July 07, 2026

ఓటరు జాబితాలో సమస్యలుంటే పరిష్కరిస్తాం

calendar_today February 9, 2024
person dharshininews
ఓటరు జాబితాలో సమస్యలుంటే పరిష్కరిస్తాం
ఓటరు జాబితాలో సమస్యలుంటే పరిష్కరిస్తాం - అనర్హులు ఉంటే సమాచారం అందించండి - తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓటరు తుది జాబితాలో సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు అన్నారు. శుక్రవారం తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 243849 మంది ఓటర్లు ఉన్నట్లు జాబితాను ప్రకటించడం జరిగగిందన్నారు. ఇందులో పురుషులు 118228, మహిళలు 125614, ఇతరులు 7 మంది ఉన్నట్లు వెల్లడించారు. జనవరి 1వ తేది 2024 నాటికి 18 ఏండ్లు పూర్తి చేసుకున్న యువతతో ఓటు హక్కు దరఖాస్తుల తరువాత తుది జాబితాను రూపొందించడం జరిగిందని తెలిపారు. ఓటర్ల తుది జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపవచ్చని నేతలను కోరారు. ఎలాంటి సమస్యలు ఉన్న పరిష్కరిస్తామని అన్నారు. అనర్హుల ఓటర్ల వివరాలను అందిస్తే తొలగింపుకు చర్యలు తీసుకుంటామని, అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా తొలగించడం జరగదన్నారు. ఈ కార్యక్రమంలో డీఏఓ మహేష్ గౌడ్, తహసీల్దార్లు తారాసింగ్, కిషన్, వెంకట స్వామి, మునీరుద్దీన్, డిప్యూటి తహసీల్దార్ విజయేందర్, రాజకీయ పార్టీల నాయకులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23706/