schedule Tuesday, July 07, 2026

మాజీ కౌన్సిలర్ లక్ష్మణ్ కన్నుమూత

calendar_today February 11, 2024
person dharshininews
మాజీ కౌన్సిలర్ లక్ష్మణ్ కన్నుమూత
మాజీ కౌన్సిలర్ లక్ష్మణ్ కన్నుమూత - అకాల మరణంపై పలువురి విచారం తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ లక్ష్మణ్ కన్నుమూశారు. ఆదివారం రాత్రి అకస్మాత్తుగా అస్వస్తతకు గురై తుది శ్వాస విడిచారు. కాంగ్రెస్స్ పార్టీ నాయకుడుగా, వాల్మీకి బోయ సంఘం నాయకులుగా ఉన్నారు. తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్ హాయాంలో కౌన్సిలర్ గా పనిచేశారు. ఆదివారం రాత్రి ఇంటి వద్ద ఉండగా అకస్మాత్తుగా ఆస్వస్తతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే లక్ష్మణ్ కన్నుమూశారు. లక్ష్మణ్ మృతి పట్ల కాంగ్రెస్స్ పార్టీ నాయకులు, వాల్మీకి బోయ సంఘం నాయకులు విచారం వ్యక్తంచేశారు. పలువురు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం తాండూరు పట్టణంలో నిర్వహించారు.   ఇదికూడా చదవండి... https://dharshininews.com/23749/